- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సిలబస్ మార్పులపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ సిలబస్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ సిలబస్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధి అవకాశాలు పెంపోందించేలా, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను ప్రక్షాళన చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రానా సమక్షంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం అకడమిక్ పాఠాలే కాకుండా, ఐఐటీ, సీసీఎంబీ, డీఆర్డీఓ, సెంట్రల్ వర్సిటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీనియర్ ప్రొఫెసర్ల సలహాలు, సూచనలతో కొత్త కరికులం రూపొందించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ, పీజీ చేస్తూనే ఉపాధి పొందేలా కోర్సుల రూపకల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కాలేజీల్లో మాత్రమే ఈ తరహా కోర్సులు ఉన్నాయని, వీటిని మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు విస్తరించాలని సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. వనరుల వినియోగంలో పరస్పర సహకారం ఉండాలని కౌన్సిల్ ఈసీ నిర్ణయించింది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు యూనివర్సిటీలు అండగా నిలవాలని సూచించారు. వర్సిటీల్లో అందుబాటులో ఉన్న అధునాతన ల్యాబ్ లు, క్రీడా మైదానాలను పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా వాడుకునేలా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. రాబోయే కామన్ ఎంట్రెన్స్ టెస్టులను పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి టెక్నికల్, ఇతర ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈసీల ఏర్పాటు, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి అధికారులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.






