కగార్ ఆపరేషన్-2ను తక్షణమే నిలిపేయాలి : సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

by Muthe.Rajitha |

కగార్ ఆపరేషన్-2ను తక్షణమే నిలిపేయాలని సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేసారు.

కగార్ ఆపరేషన్-2ను తక్షణమే నిలిపేయాలి : సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్‌ ఆపరేషన్‌ -2 నిలిపివేసి మావోయిస్టులను గౌరవ ప్రదంగా జన జీవన స్రవంతిలో కలిసేందుకు అనువైన వాతావరణం కల్పించాలని వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సాయుధ పోరాట పంథాను వీడి జన జీవన స్రవంతిలోకి రావాలని కోరారు. అర్భన్‌ నక్సలైట్ల పేరుతో వరవరరావు లాంటి వారిపై బనాయించిన అక్రమ కేసులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులు ప్రజా క్షేత్రంలోకి రావాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు.

అంతిమ లక్ష్యం నుంచి వైదోగాల్సిన అవసరం లేదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ..

కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుద్భావ వాతావరణాన్ని కల్పించి ఏలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడకుండా లైకుండా గౌరవ ప్రదమైన పునరావాసం కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. కమ్యూనిస్టులది మార్స్కీజమే అంతిమ లక్ష్యమని, దానిని నుండి వైదోలగాల్సిన అవసరం లేకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమ పంథాను మాత్రం మార్చుకోవాల్సిన అవసరముందని, ఆ దిశగా మావోయిస్టులు ఆలోచించి జనజీవన స్రవంతిలోకి రావాలిని ఆయన కోరారు. మారుతున్న పరిస్థితులు, అందివచ్చిన సాకేంతిక పరిజ్ఞానం నేపథ్యంలో సాయుధ పోరాటం అనేది ఇప్పుడు అసాధ్యమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తుపాకుల ద్వారా కాకుండా ప్రజాస్వామిక ఉద్యమాలు, ప్రజా పోరాటాల ద్వారా సైతం విప్లవాన్ని సాధించవచ్చాని అందుకు నేపాల్‌ లాంటి దేశాలు ఉదాహరణ అని సాంబశివరావు పేర్కొన్నారు.

ఈ దేశ పౌరులైన మావోస్టులను లక్ష్యంగా చేసుకుని వారిని వరస పెట్టి తుదముట్టించేంత యుద్దాన్ని కేంద్ర ప్రభుత్వంకొనసాగిస్తోందని తెలిపారు. మన దేశంపై పదే పదే దురక్రమాణకు పాల్పడే పాకిస్తాన్‌పైన గాని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఎందుకు యుద్దం చేయడం లేదని ప్రశ్నించారు. ఎర్రజెండా అంటే పాలకులకు భయమని, అందుకే వారిని తుది ముట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరూ ఎవరిని చంపిన చట్ట ప్రకారం నేరమని, మావోస్టులు తప్పులు చేస్తే చట్ట పరిధిలో శిక్షించాలే తప్ప 2026 మార్చి 31 అంటూ లక్ష్యం పెట్టుకుని చంపివేడం ఏమిటాని ప్రశ్నించారు. కేంద్రం తక్షణమే కగార్‌ ఆపరేషన్‌ నిలిపివేయాలని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని కూనంనేని సాంబశివరావు కోరారు.

మావోయిస్టులను శత్రు పూరితంగా చూడడం సరైంది కాదు : ఎమ్మెల్సీ కోదండరామ్‌

మావోస్టుల సిద్ద్దాంతాలతో ఏకీభావం ఉండకపొవచ్చుగాని వారిని శత్రు పూరితంగా ప్రజా కంటకులుగా చూస్తే దోరణి మాత్రం సరైంది కాదని ఎంఎల్‌సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రజల కోసం నిలబడి వారి కోసమే పని చేస్తున్న మావోయిస్టులది రాజకీయ పార్టీ కాబట్టి వారిపట్ల కేంద్రం విద్వేషంతో వ్యవహరించడం తగదన్నారు. మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం చట్టప్రకారం వ్యహరించాలని కోదండరామ్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రజల ప్రధాన సమస్యలే ఎజెండా ముందుకు సాగాలి : సీపీఎం నేత బండారు రవికుమార్

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగమన్నా, ప్రజాస్వామిక విలువలను ఏమాత్రం లెక్కే లేకుండ పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవి కుమార్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని విమరించుకుంటామ ప్రకటించడమే కాకుండ, మరికొందరూ అయుధాలను సైతం ప్రభుత్వానికి అప్పగించి అనేక మెట్లు దిగివచ్చిన మావోయిస్టులపై ఈ దమన కాండను కొనసాగించడం దుర్మార్గమన్నారు.

కేంద్రానిది నియంత పాలన : సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) నేత చలపతి రావు …

కగార్‌ ఆపరేషన్‌తో ఇప్పటికే మావోయిస్టుల పార్టీ ప్రధాన నాయకులను మట్టు పెట్టిన కేంద్రం ఇప్పుడు కగార్‌ ఆపరేషన్‌ -2 పేరుతో మావోయిస్టుల సానూభూతి పరులను కిందిస్థాయి క్యాడర్‌పై నిర్భాందాన్ని కొనసాగిస్తూ రాజ్యహింసకు పాల్పడుతోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ ఫాసిస్టు ప్రభుత్వం మావోయిస్టులనే కాదు ఈ దేశంలో ఉద్యమాలను, ప్రశ్నించే గొంతికలను, చివరికి ప్రతిపక్షాలను సైతం లేకుండా చేసి నియంత పాలన కొనసాగించడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ నైపథ్యంలో మావోస్టులు సైతం ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజాస్వామిక వాదులు, ప్రజాతంత్ర శక్తులుతో కలిసి ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సి అవసముందని పేర్కొన్నారు. సీపీఐ (ఎంఎల్‌ లిబరేషన్‌) రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, సీపీఐ (ఎంఎల్‌ మాస్‌లైన్‌) నాయకురాలు రమా, ఆర్ఎస్పీ నాయకులు జానకి రాములు, పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణ మాట్లాడుతూ మావోస్టులు జన జీవన స్రవంతిలో కలిసే క్రమంలో ప్రభుత్వాలు ఇచ్చే రివార్డులను స్వీకరించారాదని కోరారు.

దేశంలో అప్రకటిత ఎమర్సెనీ కొనసాగుతోందని, ఫాసిస్టు విధానాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు మరింత బలపడాల్సి ఉందన్నారు. అదాని, అంబాని లాంటి పెట్టుబడి దారుల కనుసన్నల్లో నడుస్తున్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఖనిజ సంపదను కార్పోరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకు ఈనరమేధాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. 2024 జనవరి 1 నుంచి మొదలు పెట్టిన కగార్‌ ఆపరేషన్‌ పేరుతో కేంద్రం ఇప్పటికే 90 ఎన్‌కౌంటర్లు, 1000 మందికి పైగా హత్యలను చేసిందన్నారు. కగార్‌ ఆపరేషన్‌ కేవలం మావోయిస్టులను అడ్డు తొలగిస్తే తప్ప అడవుల్లో నిక్షిప్తమైన ఉన్న కోట్లాది విలువైన ఖనిజ సంపదను దోచుకోవడం సాధ్యం కాదని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్‌ చేపట్టిందన్నారు. ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వీఎస్.బోస్, వామపక్ష పార్టీల నాయకులు బి. స్టాలిన్‌, ఛాయాదేవి, గోవర్ధన్‌, ఎస్‌ఎల్‌ పద్మ, ప్రజా సంఘాల నాయకులు అంజయ్య నాయక్‌, మారపాక అనిల్‌ కుమార్‌, ఎన్‌.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Next Story