- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానేరు డ్యాంలో మట్టి మాఫియా ఆరాచకం
కరీంనగర్ మానేరు డ్యాంలో రాత్రివేళల్లో మట్టి మాఫియా అక్రమ తవ్వకాలు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికుల ఆందోళన.

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొరం మట్టి దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రాజెక్టుల్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేస్తూ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అర్ధరాత్రులు మానేరు డ్యామ్ లో మట్టి తవ్వకాలు చేస్తూ తరలిస్తున్న మాఫియా పబ్లిక్ గా మార్కెట్లో విక్రయిస్తున్నారు. మానేరు డ్యాం ఎఫ్టీఎల్ పరిధిలో ఖాళీ బైపాస్ రోడ్డు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో అక్రమ దందా సాగిస్తున్న అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమ దందా కాస్త అధికారిక దందాగా మారి మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది.
ప్రాజెక్టులో మట్టి పబ్లిక్‌గా అమ్మకం
కరీంనగర్ నగరాన్ని ఆనుకుని ఉన్న లోయర్ మానేర్ డ్యాం కేంద్రంగా మొరం మట్టి మాఫియా అక్రమ దందా సాగిస్తున్నారు. అక్రమ దందా పై అధికారులు నోరు మెదపక పోవడంతో మట్టి తరలింపును స్థానికులు వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా మట్టిని తరలిస్తున్నారు. పైగా మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అక్రమంగా మట్టి తరలిస్తున్న మాఫియా అధికారికంగా అమ్ముకోవడంతో అక్రమ దందా అధికారుల కనుసన్నల్లో సాగుతుందా అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
రాత్రిళ్లు తవ్వకాలు పొద్దంతా అమ్మకం
అక్రమంగా మట్టి మొరం దందా సాగిస్తున్న మాఫియా మానేరు డ్యాంలో రాత్రుళ్లు జేసీబీలతో తవ్వకాలు చేస్తూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. అలా తరలించిన మట్టి-మెురం ను బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న డ్యాం ఎఫ్టీ ఎల్లో ఖాళీ స్థలంలో నిల్వ చేస్తూ పొద్దంతా పబ్లిక్ గా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. రోడ్డుపై పబ్లిక్ మట్టి -మొరం అమ్ముతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమ దందా కాస్త అధికారిక దందాలాగా సాగుతుంది. జనాల వద్ద అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
అక్రమ మట్టి దందాపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా . డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా ప్రాజెక్టుల్లో మట్టిని అమ్మి లక్షలు గడిస్తున్నారు. అమాయక జనం అడిగినంత డబ్బులు ఇస్తూ మట్టి -మొరాన్ని కోనుగోలు చేస్తున్నారు. మట్టి మొరం తరలింపుపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అక్రమ దందా ఆగకపోవడంతో ఇదంతా అధికారుల కనుసన్నల్లో సాగుతుంది అనే విమర్శలు వెలువడుతున్నాయి.
ప్రమాదంలో మానేరు డ్యాం
మానేరు డ్యాంలో ఇష్టానుసారంగా సాగుతున్న మట్టి తవ్వకాలు మానేరు డ్యాం సేఫ్టీ పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గతంలో తవ్వకాల ద్వారా ఏర్పడ్డ లోయల్లో పడి పలువురు మృతి చెందిన ఘటనలు సైతం లేకపోలేదు. దీంతో స్పందించిన అప్పటి అధికారులు డ్యాం పై లేక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశారు. దీంతో కొద్ది రోజులు అక్రమ దందా లకు చెక్ పడింది. ఇప్పుడు లేక్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ అక్రమ మట్టి దందా ఆగకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
అక్రమ దందాను ఆపండి
అర్ధరాత్రి మానేరు డ్యామ్ లో మట్టి ని తవ్వేందుకు తరలించేందుకు పెద్ద పెద్ద జేసీబీలు, టిప్పర్లు తరలించడంతో అవి చేస్తున్న శబ్దాలతో కంటిమీద కునుకు లేకుండా పోతుందంటూ మార్కండేయ నగర్‌వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు టిప్పర్లను అడ్డుకున్న ప్రయోజనం లేకుండా పోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదు. అధికారుల తీరుపై మండిపడుతూ అక్రమ మట్టి దందాను ఆపేది ఎవరు అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమదందాను అరికట్టాలని వేడుకుంటున్నారు.-మార్కండేయ నగర్ వాసులు






