Smoking: శీతాకాలంలో స్మోకింగ్.. శరీరంలో ఏ అవయవానికి ముప్పో తెలుసా?

by Kodari Anjali |

సిగరెట్లు (Smoking)తాగే అలవాటు ఒక వ్యసనం.

Smoking: శీతాకాలంలో స్మోకింగ్.. శరీరంలో ఏ అవయవానికి ముప్పో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సిగరెట్లు (Smoking)తాగే అలవాటు ఒక వ్యసనం. పొగాకులో ఉండే ప్రధానమైన నికోటిన్(Nicotine) అనే రసాయన పదార్థం(Chemical substance) వ్యసనానికి కారణమైన ఉత్ప్రేరకం.కాగా స్మోకింగ్ చేస్తే అనేక రకాల క్యాన్సర్లు(Cancers), శ్వాస సంబంధిత వ్యాధులు(Respiratory diseases) తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని.. లేకపోతే ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో అండ్ సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయని చెబుతుంటారు.

అలాగే సిగరెట్ తాగడం వల్ల శరీరానికి చాలా హాని జరుగుతుంది. స్మోకింగ్ చేస్తే ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం(Decreased oxygen levels), స్ట్రోక్ ప్రమాదం పెరగడం(Increased risk of stroke), గుండె జబ్బులు(Heart diseases), ఊపిరితిత్తులకు హాని జరగడం(Lung damage), కార్డియోవాస్కులర్ డిసీజ్ (Cardiovascular disease) వంటి వ్యాధులు వస్తాయి. సెకండ్‌హ్యాండ్ పొగను పీల్చే వారికి కూడా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. సిగరెట్ తాగడం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించడానికి, ధూమపానం మానేయడం ఉత్తమం.

అయితే శీతాకాలంలో సిగరెట్ తాగితే గుండె(heart)పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. గుండెపై తీవ్ర ఒత్తిడి పడటమే కాకుండా.. రక్తపోటు(blood pressure) పెరుగుదలకు కూడా దారీ తీస్తుంది. హార్ట్ పై అదనపు ఒత్తిడి పడితే.. హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా చలికాలంలో స్మోకింగ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story