Lucky Bhaskar: ‘లక్కీ భాస్కర్’ నుంచి సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘శ్రీమతి గారు’..

by sudharani |   (  Updated:2025-08-01 16:12:05  IST  )

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రజెంట్ ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) సినిమాతో బిజీగా ఉన్నాడు.

Lucky Bhaskar: ‘లక్కీ భాస్కర్’ నుంచి సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘శ్రీమతి గారు’..
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రజెంట్ ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) సినిమాతో బిజీగా ఉన్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా తాజాగా.. ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) నుంచి ‘శ్రీమతి గారు’ (Shrimati Garu) సాంగ్‌ను రిలీజ్ (release) చేశారు చిత్ర బృందం. ‘కోపాలు చాలాండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు.. చామంతి నవ్వే విసిరే మీరు కసిరేస్తూ ఉన్నా బాగున్నారు’ అంటూ సాగే ఈ ఎమోషనల్ (emotional) అండ్ లవ్ యాంగిల్ (Love Angle) సాంగ్‌ను విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ ఆలపించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

Click For Video...


Next Story