వారం రోజుల వ్యవధిలోనే తల్లి, కొడుకులు మృతి.. గ్రామంలో తీవ్ర విషాధం

by Satheesh |

దిశ, దౌల్తాబాద్: మండలంలోని సయ్యద్ నగర్ గ్రామ సర్పంచ్ షేక్ హసన్బీ- latest Telugu news

వారం రోజుల వ్యవధిలోనే తల్లి, కొడుకులు మృతి.. గ్రామంలో తీవ్ర విషాధం
X

దిశ, దౌల్తాబాద్: మండలంలోని సయ్యద్ నగర్ గ్రామ సర్పంచ్ షేక్ హసన్బీ (75) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. షేక్ హసన్బీ, ఆమె కుమారుడు మహబుబా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఆమె కుమారుడు మహబుబూ ఎన్నికల్లో పోటీ చేయించి తల్లిని గెలిపించుకున్నాడు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగిరెడ్డి సహకరంతో గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయితే, వారం క్రితమే మహబుబా కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ తల్లి హసన్బీ కూడా మరణించింది. వారం వ్యవధిలోనే తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వీరి మృతి పట్ల పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సంతపం వ్యక్తం చేశారు.

Next Story