పోలీసు శాఖలో సంచలనం.. వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

by Kema Shiva Kumar |

గడ్డి మందు తాగి ఏఆర్ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన వరంగల్ (Warangal) పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసు శాఖలో సంచలనం.. వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: గడ్డి మందు తాగి ఏఆర్ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన వరంగల్ (Warangal) పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పర్వతగిరి మండల పరిధిలోని సీత్యతండాకు చెందిన అనిత (Anitha) కు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన తన దూరపు బంధువు రాజేందర్‌ (Rajeder)తో గత కొంతకాలంగా పరిచయం ఉంది. రాజేందర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ నాలుగేళ్లుగా అనితను వేధిస్తున్నాడు. ఆమె డ్యూటీలో ఉన్న సమయంలోనూ వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేసేవాడని, వేరే ఎవరితోనూ మాట్లాడవద్దంటూ ఆంక్షలు పెట్టేవాడని సమాచారం. రాజేందర్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అనిత తల్లిదండ్రులు ఈ వివాహానికి నిరాకరించారు.

ఈ క్రమంలోనే అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ (Jabbar Laal) అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, అతడిని వివాహం చేసుకోవాలని భావిస్తోందని రాజేందర్ తెలుసుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న రాజేందర్.. జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి అనితపై లేనిపోనివి కల్పించి చెప్పి రెచ్చగొట్టాడు. అప్పటి నుంచి జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడం మొదలుపెట్టాడు. తనకు డబ్బులినే పెళ్లి చేసుకుంటానని అనితను బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక ఇద్దరి వేధింపులతో తీవ్ర మానసిక క్షోభకు గురైన అనిత, రాజేందర్‌కు ఫోన్ చేసి తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇద్ది వల్ల నా జీవితం నాశనమైందని, తనకు ఇక చావే దిక్కని కన్నీరు పెట్టింది. అయితే రాజేందర్ దిక్కున్న చోట చెప్పుకో.. చస్తేచావు అంటూ సమాధానమిచ్చిడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు రాజేందర్, జబ్బార్ లాల్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story