ఎన్నికల వేళ తమిళనాడులో సెన్సేషన్.. తెరపైకి రూ.365 కోట్ల కుంభకోణం

by Kema Shiva Kumar |

ఎన్నికల వేళ స్టాలిన్ సర్కారుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన సంచలన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

ఎన్నికల వేళ తమిళనాడులో సెన్సేషన్.. తెరపైకి రూ.365 కోట్ల కుంభకోణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ స్టాలిన్ సర్కారుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన సంచలన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వ విభాగాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై విభాగంలో బదిలీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, దాదాపు రూ.365 కోట్ల మేర చేతులు మారినట్లుగా ఈడీ అధికారులు ఆరోపించారు.

స్థాయిని బట్టి వసూళ్ల పర్వం..

బదిలీల కోసం ఒక్కో ఉద్యోగి నుంచి వారి స్థాయిని బట్టి రూ.7 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు లంచం వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో భారీ ఎత్తున నగదు రూపంలోనే లావాదేవీలు జరిగినట్లు ఈడీ తన విచారణలో ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ భారీ కుంభకోణంపై పూర్తి వివరాలను సేకరించిన దర్యాప్తు సంస్థ, దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్‌తో పాటు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బదిలీల వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరు.. ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్లిందనే కోణంలో ఈడీ విచారణను ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Next Story