OYO మాతృ సంస్థ ‘ప్రిజం’ ఐపీఓకి సెబీ గ్రీన్ సిగ్నల్..?

by Malleboina Mahesh |   (  Updated:2026-06-02 12:19:35  IST  )

రూ. 6,650 కోట్ల నిధుల సేకరణ కోసం ఓయో (OYO) మాతృ సంస్థ ‘ప్రిజం’కు ఐపీఓకి సెబీ (SEbi) అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

OYO మాతృ సంస్థ ‘ప్రిజం’ ఐపీఓకి సెబీ గ్రీన్ సిగ్నల్..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం భారతదేశంలో అత్యంత విజయవంతంగా రన్ అవుతున్న ప్రముఖ హోటల్ చైన్ నెట్‌వర్క్ ఓయో (OYO) మాతృ సంస్థ అయిన 'ప్రిజం' (Prism)కి సెబీ గుడ్ న్యూస్ చెప్పింది. ‘ప్రిజం’ ఐపీఓ (Initial Public Offering) ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవ్వగా క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి ఆ సంస్థకు ఐపీఓ అనుమతులు లభించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఏకంగా రూ. 6,650 కోట్ల భారీ నిధులను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

గత కొంతకాలంగా ఐపీఓ కోసం ప్రయత్నిస్తున్న ఓయో మాతృ సంస్థకు సెబీ ఆమోదం లభించడం ఒక పెద్ద మైలురాయిగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సేకరించే నిధులను కంపెనీ అప్పులను తగ్గించుకోవడానికి, అలాగే భవిష్యత్తులో వ్యాపార విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పబ్లిక్ ఇష్యూ రాబోయే రోజుల్లో భారతీయ షేర్ మార్కెట్లో అత్యంత ఆసక్తికరమైన ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story