- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రముఖ నటుడు జయరామ్ (Jayaram)ను చూడా ప్రశ్నించింది. చెన్నైలోని ఆయన స్వగృహంలోనే ఈ విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్‌కు ఉన్న పరిచయంపై అధికారులు ఆరా తీశారు. 2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ పొట్టి ఆధ్వర్యంలో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో జయరామ్ పాల్గొన్నారు. శబరిమల ఆలయానికి చెందిన ద్వారపాలకుల విగ్రహాల బంగారు కవచాలను మరమ్మతుల కోసం చెన్నైకి తరలించిన సమయంలో, ఆ కవచాలను ఉంచి ఈ పూజలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే సిట్ విచారణ సందర్భంగా నటుడు జయరామ్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం భక్తితో ఆహ్వానం మేరకే తాను ఆ రోజు పూజలో పాల్గొన్నానని క్లారిటీ ఇచ్చారు. అంతకు మించి నగలు మాయమైన వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో జయరామ్‌ను ఓ సాక్షిగా పరిగణించి ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది.






