'రుద్ర సింహ' ఆడియో లాంచ్.. గొప్ప విజయం సాధిస్తుందన్న సుమన్

by Dishanational1 |
రుద్ర సింహ ఆడియో లాంచ్.. గొప్ప విజయం సాధిస్తుందన్న సుమన్
X

దిశ, సినిమా : సంతోష్, స్నేహ, మైత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్ర సింహ'. యాక్షన్, రివెంజ్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 8న విడుదలకు సిద్ధమైంది. తాజాగా నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నటులు సుమన్, భాను చందర్‌.. పాటల సీడీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ఇండస్ట్రీకైనా చిన్న సినిమాలతోనే కళ ఉంటుందన్నారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో తీసిన చిత్రాలు గొప్ప విజయం సాధిస్తాయంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మనోహర్ కాటెపోగు దర్శకత్వంలో ఎం.కే ఫిల్మ్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, కోటేశ్వర్ రావు జింకల, మనోహర్ కాటేపోగు సంయుక్తంగా నిర్మించిన సినిమాకు రాజేష్ రాజ్ టి సంగీతం అందించారు.



Next Story

Most Viewed