- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు స్పాట్ డెడ్, 10 మందికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన ఘటన ప్రకాశం (Prakasam) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన ఘటన ప్రకాశం (Prakasam) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్ల (Konakanamitla) మండల పరిధిలోని చిన్నారికట్ల (Chinnakatla) గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, వెనుక నుంచి వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ దర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే మార్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రలను చికిత్స నిమిత్తం 108 వాహనాల్లో మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.






