AP News : మిస్సైన రూ.70 లక్షల ఫోన్లు స్వాధీనం

by Muthe.Rajitha |

పోలీసులు గత నాలుగు నెలల్లో వివిధ ప్రాంతాల్లో మిస్సైన సుమారు రూ. 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

AP News : మిస్సైన రూ.70 లక్షల ఫోన్లు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో సైబర్ క్రైమ్ పోలీసులు గత నాలుగు నెలల్లో వివిధ ప్రాంతాల్లో మిస్సైన సుమారు రూ. 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఐఎంఈఐ (IMEI) ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి, కేవలం తక్కువ కాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఫోన్లను రికవరీ చేయడం ఏపీ పోలీసుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

జిల్లాలో మొబైల్ రికవరీ కోసం అమలు చేస్తున్న 'ఆపరేషన్ మోబీ ట్రాక్' ద్వారా ఇప్పటి వరకు ఎనిమిది విడతల్లో మొత్తం రూ. 11.76 కోట్ల విలువైన 5,877 ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వివరించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, అప్పుడే ఫోన్లను ట్రాక్ చేయడం సులభమవుతుందని ఆయన సూచించారు. ఫోన్ పోయిన వెంటనే కేవలం పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా, బ్యాంక్ ఖాతాలను రద్దు చేయడం, సిమ్ కార్డును డిసేబుల్ చేయడం, పాస్‌వర్డ్‌లు మార్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని బాధితులను అప్రమత్తం చేశారు.

Next Story