- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దావోస్ సదస్సు.. రాష్ట్రానికి రూ.19,500 కోట్ల పెట్టుబడులు
దావోస్‌లో సదస్సులో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. బుధవారం సీఎం రేవంత్, మంత్రుల బృందం అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపి సుమారు రూ.19,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. రష్మి గ్రూప్‌తో రూ.12,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదరగా.. దీని ద్వారా స్టీల్ తదితర పరిశ్రమల్లో దాదాపు 12 వేల ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. అలాగే అమెరికాకు చెందిన సర్గడ్ కంపెనీతో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏవియేషన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది.
స్లోవాకియా–ఇండియా జాయింట్ వెంచర్ అయిన సోలార్ ప్రొడక్ట్స్ సంస్థతో రూ.6,000 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు EOI చేసుకుంది. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను వివరించారు. రాష్ట్రాన్ని భవిష్యత్తులో పెద్ద ఆర్థిక శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.






