'విజయ్ మాల్యా, ఇతర ఆర్థిక నేరగాళ్ల నుంచి బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు తిరిగొచ్చాయి'!

by Web Desk |
విజయ్ మాల్యా, ఇతర ఆర్థిక నేరగాళ్ల నుంచి బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు తిరిగొచ్చాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18,000 కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నేరాల్లో మొత్తం రూ. 67 వేల కోట్లు ఉన్నట్టు అంచనా. పీఎంఎల్‌ఏ కింద నేరాలను దర్యాప్తు చేయడం, స్వాధీనం చేసుకోవడం, అటాచ్‌మెంట్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఉన్న విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

పీఎంఎల్‌ఏ కింద ఈ ముగ్గురికి సంబంధించి రూ. 18,170 కోట్లను ఈడీ గతంలో సీజ్ చేసింది. ఇందులో రూ. 969 కోట్ల విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయి. బ్యాంకులకు వీరు చెల్లించాల్సిన బకాయిల్లో ఈ ఆస్తుల విలువ 80.45 శాతంగా ఉంది. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఇందులో సగం రూ. 9,371 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్టు బుధవారం ఈడీ పేర్కొంది. ఆస్తుల బదిలీ ద్వారా బ్యాంకులకు సగం వరకు రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. కాగా, ఆర్థిక నేరగాళ్లుగా నిర్ధారించబడిన వీరిని భారత్ స్వదేశానికి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.


Next Story

Most Viewed