AP News: ఎమ్మెల్యే రోజా షాకింగ్ డెసిషన్.. ఇకపై వాటికి గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటన

by Disha Web Desk 12 |
AP News: ఎమ్మెల్యే రోజా షాకింగ్ డెసిషన్.. ఇకపై వాటికి గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి, ఆంధ్రప్రదేశ్ నగరి ఎమ్మెల్యే రోజా సినిమాలకు, జబర్దస్త్ షో షూటింగ్‌లకు గుడ్‌బై చెప్పారు. జగన్ ప్రభుత్వ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి రావడం తో రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో ఎమ్మెల్యే రోజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు పదేళ్లుగా జబర్దస్త్ జడ్జిగా రోజా వ్యవహరిస్తున్నారు. మంత్రి గా బాధ్యతలు పెరగనున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరోయిన్ గా 100 కి పైగా సినిమాల్లో నటించిన ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది టీవీ షోలే.

ముఖ్యంగా 2014, 2019 ఎన్నికల్లో ఆమె గెలుపుకు కారణం టీవీల్లో ఆమె జడ్జ్ గా పాల్గొన్న కామెడీ షోలు అనే అభిప్రాయం జనం లో ఉంది. అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె ఆ షోలను కంటిన్యూ చేశారు.అయితే తాజాగా మంత్రి అయిన నేపథ్యంలో ఆమె ఆ షోలకు గుడ్ బై చెప్పనున్నారు. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనన్న రోజా తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారనీ, కానీ జగన్ తనను రెండుసార్లు MLA గా గెలిపించి ఇప్పుడు మంత్రిని చేశారని తెలిపారు.. మహిళా పక్షపాతి సీఎం కేబినెట్లో మంత్రిగా చేయడం తన అదృష్టం అని ఆమె చెప్పారు.



Next Story

Most Viewed