- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"నో షేక్ హ్యాండ్" రూల్ బ్రేక్ చేసిన రోహిత్.. వేటు తప్పదా??
"నో షేక్ హ్యాండ్" రూల్ అమల్లో ఉన్నప్పటికీ రోహిత్ శర్మ పాక్ ఆటగాడిని హగ్ చేసుకోవడం వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : T20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లు ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్ లోనూ అదరగొట్టారు. అయితే ముందుగా అందిన బీసీసీఐ ఆదేశాల ప్రకారం.. భారత క్రికెటర్లు ఎవరూ మ్యాచ్ కి ముందు గాని మ్యాచ్ అనంతరం గాని పాక్ ఆటగాళ్లతో కరాచలనం చేయలేదు. కశ్మీర్లోని పహాల్గమ్ ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ ను అన్ని రంగాల్లో దూరం పెట్టింది భారత్. ఈ క్రమంలో క్రికెట్లో కూడా పాకిస్తాన్ ను ఆల్ మోస్ట్ బాయ్ కాట్ చేసింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఆటగాళ్లంతా నో షేక్ హ్యాండ్ రూల్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారు. కనీసం ఈ కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ ఆఘా కూడా హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. కానీ భారత క్రికెట్ సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మాత్రం నో షేక్ హ్యాండ్ రూల్ ను బ్రేక్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
పాక్ ఆటగాడితో హాగ్.. చర్యలు తప్పవా?
మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ తో నవ్వుతూ మాట్లాడుతూ.. హగ్ చేసుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం భారత ఆటగాళ్ళు ఎవరూ పాక్ ప్లేయర్స్ కు దూరంగా ఉండటమే కాదు కనీసం కరచాలనం కూడా చేయకూడదు. ఈ క్రమంలో రోహిత్ చేసిన పనిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రూల్ బ్రేక్ చేసినందుకు రోహిత్ ను భారత క్రికెట్ నుంచి తప్పిస్తారనే టాక్ కూడా జోరుగా నడుస్తోంది. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
రోహిత్ కు నో రూల్స్.. కారణం ఇదే
అయితే మరోకోణంలో రోహిత్ శర్మ భారత ఆటగాడిగా మాత్రమే కాకుండా గత ఎడిషన్ ఛాంపియన్ గా ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నిన్నటి మ్యాచ్ కు హాజరయ్యారు. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో బ్రాడ్ క్యాస్టర్లు, మాజీ ఆటగాళ్లు, అన్ని దేశాల జట్లతో మాట్లాడాల్సి, కరాచలనం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు రోహిత్ T20 జట్టులో ప్లేయర్ కూడా కాదు. కాబట్టి ఈ వ్యవహారాన్ని బీసీసీఐ స్పోర్టివ్ గానే తీసుకుంటుందని కూడా చెబుతున్నవారు లేకపోలేదు.
స్పోర్టీవ్ గా చూడాలా?
మొత్తానికి రోహిత్ కావాలని పాక్ ఆటగాళ్లను కలిసి హాగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ చేసుకోలేదని తెలుస్తున్నా.. చాలామంది మాత్రం ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకొవడం లేదని అనిపిస్తోంది. భారత జట్టు దాయాది దేశం పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం చూపి విజయాన్ని చూపించిందని జాతీయ మీడియా ప్రశంసిస్తుండగా.. మరోవైపు రోహిత్ - అక్రమ్ హగ్ కూడా వైరల్ అవుతోంది.






