- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident: కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే క్లీనర్ సజీవదహనం
రోడ్డు ప్రమాదంలో క్లీనర్ సజీవదహనమైన హృదయవిదారక ఘటన కాకినాడ జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో క్లీనర్ సజీవదహనమైన హృదయవిదారక ఘటన కాకినాడ (Kakinada) జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కత్తిపూడి (Kattipudi) సమీపంలోని రావికంపాడు (Ravikampadu) జంక్షన్ వద్ద అతివేగంగా వచ్చిన ఒక లారీ రోడ్డు పక్కనే ఉన్న ఆపి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు వాహనం అంతటా దావానంలో వ్యాపించాయి.
ఈ దుర్ఘటనలో కంటైనర్‌లోనే ఉన్న క్లీనర్ బయటకు వచ్చే లోపే మంటలు చుట్టుముట్టాయి. దీంతో అతను వాహనం లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యాడు. ప్రమాద తీవ్రతకు లారీ క్యాబిన్ కూడా పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.






