Reliance: అబుదాబి కంపెనీలో పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసిన రిలయన్స్!

by Disha Web Desk 17 |
Reliance: అబుదాబి కంపెనీలో పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసిన రిలయన్స్!
X

Reliance

ముంబై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, అబుదాబి కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ ఆర్ఎస్‌సీ లిమిటెడ్(తాజిజ్)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికోసం 2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 15,000 కోట్ల) పెట్టుబడులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాటాదారుల ఒప్పందంపై సంతకం చేసినట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు కలిసి పశ్చిమ అబుదాబిలో సంయుక్తంగా పెట్రో రసాయనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అబుదాబి ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ప్రభుత్వ రంగ ఏడీ క్యూల సంయుక్త సంస్థే తాజిజ్ కంపెనీ. ఈ కంపెనీని అబుదాబిలోని రువాయిస్ ప్లాంట్‌ను అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రసాయనాలను ఉత్పత్తి చేయనున్నారు. ఈ కొత్త సంస్థ ద్వారా ఏడాదికి 9.40 లక్షల టన్నుల క్లోర్ ఆల్కలీ, 11 లక్షల టన్నుల ఇథలీన్ డై క్లోరైడ్, 3.6 లక్షల టన్నుల పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి.



Next Story

Most Viewed