పెగాసెస్‌పై ఎలాంటి విచారణకైనా రెడీ: నారా లోకేశ్

by Disha Web Desk 12 |
పెగాసెస్‌పై ఎలాంటి విచారణకైనా రెడీ: నారా లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: పెగాసెస్‌పై ఏ విచారణకైనా తాము సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం బాబాయ్‌ వివేకా హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణకు మీరు సిద్ధమా? అని సవాల్ చేశారు. ప్రభుత్వం సారా మరణాలను సహజ మరణాలుగా కొట్టిపారేయడం బాధాకరమన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్​ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని గుర్తుచేశారు. మమతా బెనర్జీ పెగాసెస్‌ విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనేది క్లారిటీ లేదన్నారు.

బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని నొక్కి చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు అన్ ఫిట్ ఫర్ హ్యుమన్ కన్సెప్షన్ అని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా తో 42 మంది చనిపోయారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో పెగాసెస్‌పై చర్చపై చైర్మన్ అనుమతించారని మండిపడ్డారు. మద్యం మరణాల పై చర్చకు రోజూ డిమాండ్ చేస్తున్న చర్చకు అనుమతించడం లేదన్నారు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్ లో సభలో వైసీపీకి 15 మంది నాయకులు ఉండరని జోస్యం చెప్పారు.


Next Story

Most Viewed