Raveena Tandon: నాతో స్టూడియో ఫ్లోర్స్‌ క్లీన్ చేయించారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

by Dishanational2 |
Raveena Tandon: నాతో స్టూడియో ఫ్లోర్స్‌ క్లీన్ చేయించారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
X

Raveena Tandon

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందడం వెనక ఎన్నో కష్టాలున్నాయని చెప్పిన ఆమె.. నిజానికి మొదట్లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదని తెలిపింది. 'నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో.. కెరీర్ ప్రారంభంలో స్టూడియో ఫ్లోర్స్‌ తుడిచాను. అక్కడ ఎవరైనా డస్ట్ వేసినా, వాంతులు చేసుకున్నా శుభ్రం చేశాను. ప్రహ్లాద్‌ కక్కర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ సమయంలో కొంతమంది 'నువ్వు స్క్రీన్‌ ముందు ఉండాల్సిన దానివి' అంటే నాకు అంత సీన్ లేదు అని చెప్పేదాన్ని' అని వివరించింది. ఈ క్రమంలోనే తాను నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదన్న రవీనా.. ప్రహ్లాద్‌ దగ్గర పనిచేసినప్పుడు ఎవరైనా మోడల్స్‌ రాని సమయంలో మేకప్‌ వేసుకుని పోజులిచ్చేదాన్నని, అలా మోడలింగ్‌ మొదలుపెట్టడంతో సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయని తెలిపింది.

Next Story