'ఆర్ఆర్ఆర్' క్రేజ్ వాడేస్తున్న ఆర్జీవీ.. మూవీ నేమ్ ఫిక్స్..

by Dishafeatures2 |
ఆర్ఆర్ఆర్ క్రేజ్ వాడేస్తున్న ఆర్జీవీ.. మూవీ నేమ్ ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు ఆర్జీవీ తన తదుపరి సినిమాను ప్రకటించాడు. సాధారణంగా ప్రతి దర్శకుడు తన సినిమా ఔట్ కమ్‌తో సంచలనాలు సృష్టిస్తే.. ఆర్జీవీ మాత్రం సినిమా అనౌన్స్‌తోనే హాట్ టాపిక్‌గా మారతాడు. తాజాగా మరోసారి ఇదే తరహాలో నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచాడు ఆర్జీవీ. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఆర్జీవీ ప్రస్తుతం ఆ మూవీ క్రేజ్‌ను తన మూవీకి వాడేసుకుంటూ తన నెక్స్ట్‌ను అనౌన్స్ చేశాడు.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా ఆర్జీవీ తన తదుపరి సినిమాను ప్లాన్ చేశాడు. సరికొత్త కథలతో ఇప్పటికే విలక్షణ నటుడిగా పేరందుకున్న ఉపేంద్ర మరోసారి తన నటనతో అందరినీ కట్టి పడేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ 'గని'లోనూ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఉపేంద్ర, ఆర్జీవీ కాంబోలో రానున్న సినిమాకు 'ఆర్' అని పేరు పెట్టారు. దీనికి సంబందించిన మోషన్ పోస్టర్‌తో ఆర్జీవీ ఈ అనౌన్స్ మెంట్ చేశాడు. మరి ఈ మూవీతో ఆర్జీవీ ఏమాత్రం హిట్ అందుకుంటాడో చూడాలి.

Next Story

Most Viewed