- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Gandhi: ఎప్స్టీన్ ఫైల్స్ తో ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ గాంధీ బాంబు
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2026-27 పై లోక్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2026-27 పై లోక్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. భారీ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళ్తుందని, అమెరికా డీల్ తో వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారని విమర్శలు చేశారు. అమెరికా ముందు భారత్ ప్రభుత్వం మోకరిల్లిందని, ప్రధాని మోడీ ట్రంప్ కు సరెండర్ అయ్యారని రాహుల్ గాంధీ విమర్శించారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన రాహుల్ గాంధీ.. మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా మారిన అమెరికాకు చెందిన‘ ఎప్స్టీన్ ఫైల్స్’ (Epstein Files) లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో పెను దుమారం రేపాయి. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DoJ) వద్ద ఉన్న ఫైళ్లలో వీరి పేర్లు ఉన్నాయని, ఈ సమాచారాన్ని తాను ధృవీకరించగలనని రాహుల్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం వెనుక ఏదో 'అదృశ్య ఒత్తిడి' ఉందని ఆయన ఆరోపించారు.
అదానీ గ్రూప్‌పై కొనసాగుతున్న విచారణల గురించి కూడా రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. అదానీకి సమన్లు జారీ అయినప్పటికీ, గత 18 నెలలుగా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీపై నేరుగా ఒత్తిడి ఉందని, అందుకే ఒక సాధారణ ప్రధాని ఎవరు తీసుకోని విధంగా డేటా, రైతులు, రక్షణ, ఇంధన భద్రత కు సంబంధించిన నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకుంటోందని విమర్శించారు. ఎవరైనా తమపై గట్టి పట్టు (Grip) కలిగి ఉన్నప్పుడే ఇలాంటి సాహసోపేతమైన, దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారని రాహుల్ వ్యాఖ్యానించారు.
భారతదేశ డేటాను అమెరికాకు ధారాదత్తం చేయడం ద్వారా మన సార్వభౌమత్వాన్ని కోల్పోయామని రాహుల్ మండిపడ్డారు. దేశంలోని 1.5 బిలియన్ల ప్రజల డేటా మన అసలైన శక్తి అని, కానీ మోడీ ప్రభుత్వం దానిని విదేశీ కంపెనీల నియంత్రణలోకి వెళ్లేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వాణిజ్య ఒప్పందం కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టారని, దీని వెనుక ఉన్న అసలు శక్తులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ 'ఎప్స్టీన్ ఫైల్స్' ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి.






