- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CNG గ్యాస్ కష్టాలు.. వందలాది ఆటోల క్యూ
కర్ణాటక రాజధాని బెంగుళూరులో తీవ్ర CNG గ్యాస్ కొరత నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు నగరంలో గత కొన్ని రోజులుగా ఆటో ఎల్పీజీ (Auto LPG), సీఎన్జీ (CNG) కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. నగరంలోని వేలాది మంది ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నగరంలోని సుమారు 1.8 లక్షల ఆటోలలో మెజారిటీ వాహనాలు గ్యాస్‌పైనే ఆధారపడి నడుస్తుండటంతో, ఈ కొరత రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెజారిటీ ప్రైవేట్ గ్యాస్ స్టేషన్ల వద్ద "నో స్టాక్" (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడైనా గ్యాస్ అందుబాటులో ఉందన్న సమాచారం వస్తే, అక్కడ వందలాది ఆటోలు కిలోమీటర్ల మేర ఆటోలు క్యూ కడుతున్నాయి. గ్యాస్ కోసం డ్రైవర్లు దాదాపు 6 నుండి 8 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. కొందరు డ్రైవర్లు రాత్రంతా బంకుల వద్దే నిద్రపోతూ ఉదయాన్నే గ్యాస్ నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
దీనివల్ల వారి రోజువారీ సంపాదన పూర్తిగా పడిపోతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఇదే అదనుగా ఆటో ఎల్పీజీ ధరలు లీటరుకు రూ. 15 నుండి రూ. 20 వరకు పెంచినట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో లీటరు ధర రూ. 90 కి చేరడం డ్రైవర్లపై అదనపు భారంగా మారింది. ఆటోలు గ్యాస్ క్యూలలో ఉండిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఆటోల కోసం ఎదురు చూడటం, ఉన్నవాటికి అధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం "కొరత లేదు" అని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండటంతో ఆటో డ్రైవర్ల సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి.






