TRS సర్కార్‌కు అనూహ్య షాక్.. ఆధారాలతో ఢిల్లీ వెళ్లిన ప్రొఫెసర్ కోదండరాం

by Disha Web Desk 2 |
TRS సర్కార్‌కు అనూహ్య షాక్.. ఆధారాలతో ఢిల్లీ వెళ్లిన ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భుపేంద్ర యాదవ్‌ను గురువారం కలిశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పచ్చని పంట పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు బలవంతపు భూ సేకరణ జరుగుతున్నదని, పరిశ్రమల ఏర్పాటును అడ్డుకొని, భూసేకరణను ఆపాలని కేంద్రమంత్రికి జహీరాబాద్ భూ నిర్వాసితులతో కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు 12635 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని, ఆధారాలతో మంత్రికి ఫిర్యాదు చేశారు. 90 శాతం వ్యవసాయ భూమి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 శాతం భూమి మాత్రమే వ్యవసాయ భూమి ఉందని తప్పుడు నివేదిక ఇచ్చిందని భూనిర్వాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిమ్జ్ కోసం 22 గ్రామాల పరిధిలో దాదాపు 12,635 ఎకరాల భూ సేకరణ జరుగుతోందని వివరించారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ.. నేషనల్ హ్యూమన్ రైట్స్‌లో ఫిర్యాదు చేస్తామని, ఇండస్ట్రీ మినిస్టర్‌నూ కలుస్తామని, వెంటనే బలవంతపు భూ సేకరణ ఆపాలని, రైతుల పొట్ట కొట్టొద్దని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల భూముల కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కోదండరామ్ వెంట భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప, రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed