Producer: ఈ సినిమా కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ కి మాత్రమే తెలుసు

by Gantepaka Srikanth |

శర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి సినిమా సంక్రాంతి పండక్కి రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

Producer: ఈ సినిమా కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ కి మాత్రమే తెలుసు
X

దిశ, వెబ్‌డెస్క్: శర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి సినిమా సంక్రాంతి పండక్కి రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రొడ్యూసర్ రాజేష్ దండ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమా ప్రేక్షకుల మనసుల్లోకి మెల్లగా వెళ్లింది. క్రమంగా థియేటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటంతో తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశాం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు థియేటర్ల సంఖ్య పెరుగుతున్న విధానం చూస్తుంటే ఈ వారమే రిలీజ్ అయిందా? అనే అనుమానం మాకే వస్తోంది. ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వస్తాయో ప్రొడ్యూసర్లుగా మాకే తెలుస్తుంది. తామేం నెంబర్ గేమ్ ఆడాలనుకోవడం లేదు’ అని నిర్మాత రాజేశ్ చెప్పుకొచ్చారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ, కథనం, నటీనటుల టైమింగ్ సినిమాకు బలంగా నిలిచాయి. థియేటర్లలో నవ్వుల సందడి కొనసాగుతుండటంతో డిమాండ్ పెరిగిందని, ఈ వారం నుంచి మరిన్ని స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

Next Story