- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ బ్యూటీ పాటకు ప్రభాస్ ఫిదా.. నేరుగా నా మనసును తాకిందంటూ పోస్ట్
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ (Raveena Tandon)కూతురు రాషా తడాని ఒకేసారి అటు నటిగా, ఇటు సింగర్‌గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ (Raveena Tandon)కూతురు రాషా తడాని ఒకేసారి అటు నటిగా, ఇటు సింగర్‌గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. హిందీలో అభయ్ వర్మ హీరోగా నటిస్తున్న 'లైకీ లైకా' అనే రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ చిత్రంలోని 'చాప్ తిలక్' అనే పాటతో రాషా సింగింగ్ డెబ్యూ ఇచ్చింది. సౌరభ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రాషా పాటకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిదా అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘రాషా, నీ సింగింగ్ డెబ్యూ అద్భుతంగా ఉంది.
నీ గొంతు నేరుగా మనసును తాకింది’’ అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. అది చూసిన రాషా కూడా "ప్రభాస్ సార్.. ఎప్పటికీ మీకు కృతజ్ఞురాలిని’’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంటూ రెడ్ హార్ట్ సింబల్, దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు చర్చలు మొదలెట్టారు. రాషాకు పాటకు ఫిదా అయిన ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్‌లలో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక టాలీవుడ్‌లోనూ రాషా గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది.
ఘట్టమనేని వారసుడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ సరసన 'శ్రీనివాస మంగాపురంలో' హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. అటు తెలుగు, ఇటు హిందీ సినిమాలతో పాటు సింగర్‌గానూ రాణిస్తున్న రాషా, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాషా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే.. తన పాపులారిటీని పెంచుకుంటోంది.






