దోమల సహాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు

by Dishafeatures2 |
దోమల సహాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసులు, అధికారులు ఎన్ని నిబంధనలు పెట్టినా నేరస్థులు తాము అనుకున్నది చేయడానికి ఏదో ఒక దారి వెతుక్కుంటారు. అందులో దొంగలు ముందుంటారు. గల్లీల్లో పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా తమ హస్తలాఘవం చూపిస్తూనే ఉంటారు. ఆ తర్వాత వారిని పట్టుకునేందుకు పోలీసులు తెగ ప్రయత్నిస్తుంటారు. కానీ, తాజాగా చైనా పోలీసులు దోమల సహాయంతో ఒక దొంగను పట్టుకున్నారు. ఇది చైనా ఫుజో‌లో జరిగింది. ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతడు తప్పించుకుని వెళ్లిపోయాడు. అయితే పోలీసులు అక్కడ చనిపోయి ఉన్న రెండు దోమలు చూశారు. వెంటనే వాటి నుంచి రక్తాన్ని తీసుకొని దానికి డీఎన్ఏ పరీక్ష చేశారు. ఆ వివరాలతో అతడెవరు అనేది తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 'ఆ ఇల్లు కొత్తగా పెయింటింగ్ చేయబడింది. కాబట్టి ఆ గోడలపై దోమలు చనిపోయి ఉన్నాయి. వాటి నుంచి తమకు దొరికిన రక్తం దొంగదే అయ్యుంటుందని భావించాము. వెంటనే దానిని పరీక్షించి అతడిని అదుపులోకి తీసుకున్నాం' అని పోలీసులు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed