- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుచ్చకాయల లోడ్ కింద మృత్యు రాశులు.. కంగుతిన్న పోలీసులు
ఓ పుచ్చకాయల లోడ్ కింద కీలోల కొద్ది పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం గా మారింది. ఈ షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ పట్టణ సమీపంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ పుచ్చకాయల లోడ్ కింద కీలోల కొద్ది పేలుడు పదార్థాలు (Explosives) పట్టుబడటం కలకలంగా మారింది. ఈ షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాలక్కాడ్ టౌన్ సౌత్ పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో చేపట్టారు. ఈ క్రమంలో ఆటుగా వచ్చిన ఒక పికప్ వ్యాన్ చెక్ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న వందకు పైగా పేలుడు పదార్థాల పెట్టెలను పోలీసులు గుర్తించారు.
పుచ్చకాయల మాటున పేలుడు పదార్థాలు
పాలక్కాడ్ టౌన్ సౌత్ పోలీసుల కథనం ప్రకారం.. ఒక పికప్ వ్యాన్ అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేశారు. పైకి చూడటానికి ఆ వ్యాన్ నిండా పుచ్చకాయల లోడ్ కనిపిస్తున్నప్పటికీ, లోపల తనిఖీ చేయగా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. పుచ్చకాయల కింది భాగంలో రహస్యంగా అమర్చిన 100కు పైగా జిలెటిన్ స్టిక్స్ (Gelatin Sticks) పెట్టెలను, అలాగే 20కి పైగా డిటోనేటర్ల (Detonators) పెట్టెలను పోలీసులు గుర్తించారు.
అనంతరం వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడటంతో ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. "సుమారు 100 పెట్టెల జిలెటిన్ స్టిక్స్, 20 పెట్టెల డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నాం. వీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నాం" అని పాలక్కాడ్ టౌన్ సౌత్ పోలీస్ అధికారి తెలిపారు.
సాధారణంగా ఇలాంటి పేలుడు పదార్థాలను అక్రమ క్వారీయింగ్, బావుల తవ్వకాల కోసం వాడుతుంటారు. అయితే, వీటి వెనుక మరేదైనా కుట్ర ఉందా? లేదా ఉగ్రవాద కోణాలు ఏమైనా ఉన్నాయా? అనే దిశగా కూడా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.






