- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్త హెచ్‌పివి (HPV) వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ అజ్మీర్‌లో 14 ఏళ్ల బాలికల కోసం హెచ్‌పివి (HPV) వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఏటా కోటి మందికి పైగా బాలికలకు ప్రభుత్వ కేంద్రాల్లో ఈ టీకాను ఉచితంగా అందజేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గర్భాశయ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా చేసుకున్న మోడీ ప్రభుత్వం హెచ్‌పివి (HPV) వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) 14 ఏళ్ల బాలికల కోసం జాతీయ స్థాయి హెచ్‌పివి (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) బారి నుంచి దేశంలోని యువతులను రక్షించడమే లక్ష్యంగా ఈ బృహత్తర పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చింది.
హెచ్‌పివి (HPV) వ్యాక్సిన్ ముఖ్య లక్ష్యం
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంతో ఖరీదైన వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్దేశించిన అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి. గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న నేపథ్యంలో, చిన్న వయస్సులోనే ఈ టీకా ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఆ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ముందస్తు చర్యల్లో భాగంగా ఉచితంగా 14 బాలికలకు ఈ HPV వ్యాక్సిన్ అందించనున్నారు.






