యూట్యూబ్‌లో ప్రధాని మోడీ సరికొత్త రికార్డు

by Malleboina Mahesh |

యూట్యూబ్‌లో 30 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో ప్రధాని మోదీ రికార్డు! ప్రపంచ నేతల్లో నంబర్ వన్; ట్రంప్ కంటే 7 రెట్లు అధికం.

యూట్యూబ్‌లో ప్రధాని మోడీ సరికొత్త రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఇప్పటికే తనకు ఉన్న ఫాలోవర్స్‌తో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల (Social media platforms)లో రికార్డు సృష్టించారు. తాజాగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ (Youtube)లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్ల (3 కోట్ల) మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలలో ఇంతటి భారీ స్థాయిలో సబ్‌స్క్రైబర్లు కలిగిన ఏకైక నేతగా ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రజలతో మమేకమవడానికి సమర్థవంతంగా ఉపయోగిస్తున్న నేతగా ఆయన మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

ప్రపంచంలోని ఇతర అగ్రనేతలతో పోలిస్తే ప్రధాని మోడీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో రెండో స్థానంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే మోడీకి దాదాపు ఏడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కేవలం సబ్‌స్క్రైబర్ల సంఖ్యలోనే కాకుండా, ఆయన ఛానెల్‌లో పోస్ట్ చేసే వీడియోలకు వచ్చే వ్యూస్, ఎంగేజ్‌మెంట్‌లో కూడా ప్రధాని మోడీ ప్రపంచ స్థాయి రికార్డులను తిరగరాస్తున్నారు.

Next Story