మాన్యకుంటను రజకులకు కేటాయించండి.. మంత్రికి వినతి పత్రం

by Web Desk |
మాన్యకుంటను రజకులకు కేటాయించండి.. మంత్రికి వినతి పత్రం
X

దిశ: బయ్యారం: మండలంలోని కొత్తపేట పంచాయితి పరిధిలో గత నలబై సంవత్సరాలుగా మాన్య కుంట సర్వే నెంబరు 62 లో గల 4.33 గుంట భూమి రజకులు తమ కుల వృత్తి నేపథ్యంలో కుంటలో బట్టలను శుభ్రం చేసేందుకు వాడుకుంటున్నట్లు రజకుల సంఘం అద్యక్షుడు మాచర్ల ఉపేందర్, కార్యదర్శి పసునూరి సత్యం తెలిపారు.

మంగళవారం మాన్య కుంట రజకులకు కేటాయించాలని ఎన్నో సార్లు కలెక్టర్ కు మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ క్యాంపు కార్యాలయంలో కలిసి మాన్యకుంట గత కొన్ని సంవత్సరాల క్రితం గిరిజన రైతు ఆజ్మీరా సీక్యా కొత్తపేట రజకులు తమ కుల వృత్తి కోసం వాడుకునేందుకు వారికి రాసి ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం మంత్రికి వినతి పత్రం అందించారు .

దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు , బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి , కొత్తనపేట రజక సంఘం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed