పవన్ భార్యలకు ముద్రగడ బంఫర్ ఆఫర్.. వైరల్ అవుతున్న పెద్దాయన వ్యాఖ్యలు

by srinivas |
పవన్ భార్యలకు ముద్రగడ బంఫర్ ఆఫర్.. వైరల్ అవుతున్న పెద్దాయన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు సీనియర్ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురు ఎపిసోడ్‌లో పవన్‌దే తప్పంటూ దుమ్మెత్తిపోశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను వృద్ధనారీ ప్రతివతతో పోల్చారు. వృద్ధనారీ ప్రతివతలా కబుర్లు చెప్తున్నారంంటూ సెటైర్లు వేశారు. పిఠాపురం అభ్యర్థి వంగా గీత కాపు కాదా అంటూ ముద్రగడ ప్రశ్నించారు. పవన్ మాత్రమే కాపునా అని నిలదీశారు. పవన్ ఖచ్చితమైన కాపునేనా అని అనుమానం వ్యక్తం చేశారు. నిజమైన కాపు అయితే చరిత్ర బయట పెట్టాలని సూచించారు. తాను మాత్రం కచ్చిమైన కాపునేనని చెప్పారు. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. పవన్ ముగ్గురు భార్యలకు కావాలంటే వైసీపీలో టికెట్ ఇప్పిస్తానని వ్యాఖ్యానించారు. దుష్టుల వల్లే తన కూతురుకి దగ్గరయ్యాయని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More...

‘మీ ప్రయాణం ఓ ఆశా ద్వీపం’ ..పవన్‌కు మద్దతుగా సీనియర్ నటుడు?

Next Story