విద్యుత్ షాకులతో మృత్యువాద పడుతున్న రాజహంసలు!

by Disha Web Desk 5 |
విద్యుత్ షాకులతో మృత్యువాద పడుతున్న రాజహంసలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో హైటెన్షన్ వైర్లకు తగిలి విద్యుత్ షాకుల వల్ల రాజహంసలు మృతి చెందుతున్నాయి. మహబూబ్‌నగర్‌లోని సోమశిలలో కృష్ణానది సమీపంలో రాజహంసలు విద్యుదాఘాతంతో మృత్యువాత పడుతున్నాయని నదీ చుట్టు ప్రక్కల ప్రాంతాల గ్రామస్తులు కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సోమశిల రెవెన్యూ భూమిలో ఇలా జరుగుతోందని, రాయలసీమ, రంగారెడ్డి జిల్లాల మధ్య పునరుత్పాదక విద్యుత్తు తీగలను పక్షులు ఢీకొంటుంటాయని, అధికారుల వద్ద ఉన్న బర్డ్ చెక్‌లిస్ట్‌లో ఫ్లెమింగోలు లేనందున మేం కూడా ఆశ్చర్యపోయామని నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి గోపిడి రోహిత్ అన్నారు.

అలాగే కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. సోమశిల వద్ద నదిలో ఈ ఫ్లెమింగో మరణాలు సంభవిస్తున్నాయని, గత కొన్ని రోజులుగా కనీసం 10 ఫ్లెమింగోలు చనిపోయాయని స్థానికులు మాకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఫ్లెమింగోలు ఎగురుతున్నప్పుడు, ఒకదానితో మరొకటి ఢీకొనేటప్పుడు హై-టెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైన్‌లను తాకవచ్చని, పక్షులు వైర్లను ఢీకొనకుండా ఉండేలా బర్డ్ రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Next Story