Power Star Pawan Kalyan: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త పోస్టర్ విడుదల

by Disha Web Desk 2 |
Power Star Pawan Kalyan:  ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త పోస్టర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ''హరిహర వీరమల్లు'' చిత్రం చేస్తున్నారు. సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో పాటు పాన్ ఇండియా‌ సినిమాగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేగాక, తాజాగా.. విడుదల చేసిన షూటింగ్ రీస్టార్ట్ వీడియోలో పవన్ కల్యాణ్ కష్టపడ్డ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ ఎంతో కష్టపడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా.. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ మాస్ లుక్ చూసిన అభిమానులు సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేగాక, ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రలో నటించడం కోసం అకీరా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవనటంలో సందేహం లేదు.


Next Story

Most Viewed