- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థానీ రిపోర్టర్‌కి చిర్రెత్తుకొచ్చింది.. చెంప ఛెళ్లుమంది..! (వీడియో)
'మంచిగా బుద్ది చెప్పావంటూ' చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. Woman journalist slaps boy while speaking on camera.

దిశ, వెబ్‌డెస్క్ః ఉచితానుచితాలు మరిచిపోయి, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే పరిణామం ఇలాగే ఉంటుందని ఈ సందర్భం గుర్తుచేస్తుంది. ఓ పాకిస్థానీ మహిళా జర్నలిస్ట్ మైరా హష్మీ సీరియస్‌గా ఒక కుటుంబానికి సంబంధించిన సమస్యను రిపోర్టు చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోకుండా ఓ అబ్బాయి అనుచితంగా ప్రవర్తించడంతో చెంపదెబ్బ తినాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, లక్షల్లో వ్యూవ్స్‌తో 'మంచిగా బుద్ది చెప్పావంటూ' చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
అయితే, మొదట్లో, ఆమె ఎందుకు అంత ఆగ్రహానికి గురైందో చాలా మందికి తెలియలేదు. ఆ యువకుడు ఏదో అనాలోచితంగా మాట్లాడాడని, దీంతో రిపోర్టర్ నిగ్రహాన్ని కోల్పోయిందని భావించారు. ఏది ఏమైనప్పటికీ, అలా కొట్టడం భావ్యం కాదని ఆమె ప్రవర్తనను కొందరు విమర్శించడంతో, మైరా హష్మీ వివరణ ఇచ్చారు. ఆ యువకుడు ఒక కుటుంబాన్ని వేధిస్తున్నాడని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌లో పేర్కొంది. అతన్ని వారించడానికి ప్రయత్నించినప్పటికీ అతని వల్ల కుటుంబం ఇబ్బందికి గురైందని చెప్పింది. ఈ ప్రవర్తన ఇక భరించదగినది కాదు అనుకున్నప్పుడే అతన్ని కొట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
So how was your day? pic.twitter.com/FqOxNNmlBc
— Naila Inayat (@nailainayat) July 11, 2022






