- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాజా శాంతి మండలిలో పాకిస్తాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలిలో పాకిస్తాన్ సభ్యదేశంగా చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్)లో పాకిస్తాన్ సభ్యదేశంగా చేరింది. గురువారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. ట్రంప్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ మండలిలో చేరేందుకు అంగీకరించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ఈ శాంతి మండలిని ప్రారంభించారు. గాజాలో శాంతి, పునర్నిర్మాణం, మానవతా సహాయం కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పని చేస్తామని పాకిస్తాన్ తెలిపింది. ఈ బోర్డ్‌లో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, యుఏఈ, ఇండోనేషియా, కతార్ వంటి దేశాలు కూడా ఉన్నాయి.
అయితే, పాకిస్తాన్ వంటి ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలు ఇందులో ఉండటంపై కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఇది యూఎన్‌ను పక్కన పెట్టే ప్రయత్నమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినా, గాజాలో శాంతి కోసం అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.






