విపక్షాలు మహిళలకు అన్యాయం చేశాయి : చంద్రబాబు

by Muthe.Rajitha |

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.

విపక్షాలు మహిళలకు అన్యాయం చేశాయి : చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష 'ఇండియా' కూటమి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళా సాధికారత వైపు భారత్ వేయాల్సిన ఒక చరిత్రాత్మక అడుగును అడ్డుకుందని ఆయన ధ్వజమెత్తారు. ఇది కేవలం రాజకీయ పరమైన అడ్డంకి మాత్రమే కాదని, సమాన హక్కులు, సముచిత ప్రాతినిధ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు చేసిన ఈ ద్రోహాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం 2029 నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని చూసినా, ప్రతిపక్షాల వ్యతిరేకతతో బిల్లు ఆమోదం పొందలేకపోయింది.

Next Story