- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సొంతింటి కల నిజం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే : డీసీసీ అధ్యక్షుడు
పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. గురువారం పట్టణంలోని పాత పాలమూరులో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారు శ్రావణి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పేదరిక నిర్మూలన కాంగ్రెస్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, ప్రతి పేదకుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. పేదలు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసీసీ ఉపాధ్యక్షుడు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, కార్పోరేటర్లు రమేష్ బాబు, ఉమర్ కొత్వాల్, చందు యాదవ్, నరేష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.






