- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేవెళ్ల డీసీపీ పరిధిలోని స్టేషన్లను వదలని సీఐలు
ఫ్యూచర్ సిటీ పరిధిలో సీఐల బదిలీల సందడి! పాత వారికే పట్టం కడుతున్నారా? రియల్ దందా కోసమే పైరవీలా? కమిషనర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.

దిశ, చేవెళ్ల: వదల బొమ్మాళి.. వదల..! నిన్ను వదల అన్న అరుంధతి సినిమా డైలాగ్ ఈ పోలీస్ స్టేషన్లకి వర్తిస్తుందేమో..!? కొత్త సీసాలో.. పాత నీరు.. అన్న చందంగా సీఐల బదిలీలు ఉండనున్నాయా..? అయితే కొందరు అవుననే సమాధానం ఇస్తున్నారు..!? కాగా.. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గతంలో ఇక్కడ పని చేసిన వారిని రాకుండా మార్పులు చేస్తారా..! లేకపోతే నూతన ఒరవడికి శ్రీకారం చూడతారా? అనే సందేహం నెలకొంది. ఒకటి, రెండు రోజుల్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
చేవెళ్ల డీసీపీ పరిధిలో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మోకిల, షాబాద్ తదితర పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అందులో మోకిల, శంకర్పల్లి, మొయినాబాద్ వాటి పరిధిలో కీలకంగా ఉంటాయి. గతంలో ఇక్కడ పని చేసిన ఎస్ఐలు, సీఐలు ప్రమోషన్లు వచ్చాక మళ్లీ అవే పోలీస్ స్టేషన్లకు సీఐలుగా రావడానికి జోరుగా పైరవీలు మొదలు పెట్టారు. పోలీస్ శాఖలో ఈ అంశంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఒకటి.. రెండు రోజుల్లో సీఐల బదిలీల ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉన్నది. వదల బొమ్మాళి.. వదల.. అన్న చందంగా అర్దర్స్ రెడీ అవుతున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.
గతంలో పనిచేసిన వారికే..
గతంలో ఆయా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు, సీఐలుగా పని చేసిన వారికే మళ్లీ ఆ పోలీస్ స్టేషన్లకే సీఐలుగా అవకాశం కల్పించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తున్నది. పైరవీలు చేసుకొని ఇక్కడికి వస్తునట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక్కడికి రావడానికి ఎంతో మంది వేరే చోటు నుంచి శివారులో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్న వారిని కాదని.. కొంతమంది కొత్త వాళ్లకు అవకాశం రాకుండా ఉన్న వాళ్లను కాదని.. గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిన వాళ్లకి మళ్లీ అవకాశం రావడంతో పోలీస్ శాఖలో గుసగుసలు మొదలయ్యాయి. చేవెళ్ల డీసీపీ పరిధిలో ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న తమ బిజినెస్ పనులు సక్క పెట్టుకోవడానికి ఈ సీఐలు వస్తున్నట్లు సమాచారం.
చేవెళ్ల నగర శివారులో రియల్ వ్యాపారం
చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో 5 పోలీస్ స్టేషన్ల పరిధి ఉంది. ఇక్కడ ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు ఉన్నారు. ఇటీవల కొత్త చేవెళ్ల డీసీపీ పోస్ట్‌ను క్రియేట్ చేశారు. మొయినాబాద్ లో కొత్తగా ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ పని చేసిన సీఐలు ఎవరెవరు మళ్లీ పాత పోలీస్ స్టేషన్లకు రావడానికి పైరవీలు చేస్తున్న విషయాలు కొత్తగా వచ్చిన అధికారులకు తెలియకపోవచ్చు. దీంతో డీసీపీ ప్రత్యేక దృష్టి సారించి వ్యాపారం పనులు సక్క పెట్టుకోవడానికి వచ్చే అధికారుల రాకకు అడ్డుకట్ట వేస్తారో... లేకపోతే వారికి సహకరించి మద్దతుగా ఉంటారో.. ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తారో వేచి చూడాలి. కాగా, నగర శివారులో చేవెళ్ల ఉండటం, ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగా సాగే అవకాశం.. లిటికేషన్ భూములు ఉండడం.. ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్ లు ఉండడంతో ఆయా పోలీస్ స్టేషన్ సీఐల పోస్ట్ పై కర్చీఫ్ వేయడం.. దానికి తోడు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి వ్యాపారం చేసుకోవచ్చని ఆలోచనతో వస్తున్నారని సమాచారం.
కాస్త ఆలోచించండి.. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారు
ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ గతంలో పని చేసిన సీఐ మళ్లీ అవే పోలీస్ స్టేషన్లకు ఎలా బదిలీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చేవెళ్ల డీసీపీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో పని వేరే చోటు బదిలీ అయి మళ్లీ అవే పోలీస్ స్టేషన్లకు సీఐలుగా పోస్ట్ లు కేటాయించడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనలు చేసి నూతన ఒరవడికి శ్రీకారం చూడతారో వేచి చూడాల్సిందే మరి.
బాధితులకు న్యాయం జరిగేనా..?
బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వచ్చే అధికారులు ఇక్కడి ప్రజలకు న్యాయం చేయడానికో.. వారి మీద జాలి చూపడానికో రావడం లేదు. పక్కా ప్రణాళిక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.






