అధికారుల కల్పతరువుగా ఖాళీ ఫ్లాట్లు

by Muthe.Rajitha |

పేద, మధ్య తరగతి ప్రజలకు రాయితీతో సొంతింటిని అందించేందుకు ఏర్పాటు చేసిన హౌసింగ్​ బోర్డు శాఖ వెస్ట్రాన్​ డివిజన్​ అధికారుల నిర్లక్ష్య పనితీరుతో తన ఉనికిని కోల్పోతుంది.

అధికారుల కల్పతరువుగా ఖాళీ ఫ్లాట్లు
X

దిశ, కూకట్​పల్లి: ‘సొమ్మొకరిది సోకొకరిది’ చందంగా మారింది తెలంగాణ హౌసింగ్​ బోర్డు శాఖ తీరు. పేద, మధ్య తరగతి ప్రజలకు రాయితీతో సొంతింటిని అందించేందుకు ఏర్పాటు చేసిన హౌసింగ్​ బోర్డు శాఖ వెస్ట్రాన్​ డివిజన్​ అధికారుల నిర్లక్ష్య పనితీరుతో తన ఉనికిని కోల్పోతుంది. దశాబ్ధం క్రితం కేపీహెచ్​బీకాలనీ 4వ ఫేజ్​లో 630 ఎల్​ఐజీ ఫ్లాట్లు​ వెంచర్​-2 పేరుతో సింగిల్, డబుల్​ బెడ్​ రూం ఇళ్ల సముదాయాన్ని తెలం గాణ హౌసింగ్​ బోర్డు శాఖ నిర్మించింది. ఇందులో 630 ఫ్లాట్స్​కు ఇంకా 31 ఫ్లాట్స్​ మిగిలి ఉండగా అందులో 5 ఫ్లాట్స్​కు లబ్ధిదారులు ప్రాథమికంగా కొంత రూసుము చెల్లించారు. మిగిలి ఉన్న 16 సింగిల్​ బెడ్​ రూం, 10 డబుల్​ బెడ్​ రూం ఫ్లాట్లు​ ఎవరికీ కేటాయించకుండా ఖాళీగా ఉన్నాయి. ఇది లా ఉంటే ఖళీగా ఉన్న కొన్ని ఫ్లాట్స్​ను వెస్ట్రా న్​ విభాగానికి చెందిన కొందరు అధికారు లు బయటి వ్యక్తులకు కిరాయికి ఇచ్చి నెల నెలా సొమ్మ చేసుకుంటున్నారు.

సెక్యురిటీ ఏజన్సీకి రెండ్లు ప్లాట్లు?

6వ బ్లాక్​లోని ఎఫ్​-903, 904 ప్లాట్స్​ సె క్యూరిటీ సంస్థకు సంబంధించిన సురేష్​ అనే వ్యక్తి ఆధీనంలో ఉన్నాయి. నిజానికి సెక్యూ రిటీ సూపర్​వైజర్​ సురేష్​కు హౌసింగ్​ బోర్డు శాఖకు ఎటువంటి సబంధం లేకపోయిన రెండు ఫ్లాట్లును సదరు సురేష్​ అనే వ్యక్తి తన ఆధీనంలో ఉంచుకొని విలాసానికి వినియోగిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. అంతే కాకుండా దశాబ్దం క్రితం గృహ సముదాయాన్ని నిర్మించిన కాంట్రక్టర్​ కూడా తన ఆ ధీనంలో పలు ప్లాట్స్​ ఉంచుకొని నెల నెలా కిరాయి వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఖాళీగా ఉన్న వాటికి సంబంధించిన విద్యుత్​ బిల్లులు ఇప్పటికి ఈఈ వెస్ట్రన్​ డివిజన్​ పేరుతో వస్తున్నాయి.

అధికారుల చేతి వాటం

కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన గృహ సముదాయంలోని ఇళ్లను వేలం ద్వా రా ప్రజలకు కెటాయించాల్సిన అధికారులు ఖాళీగా ఉన్న ఇళ్లను దశాబ్ద కాలంలో కిరాయిలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నరు. ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణ లేక పోవడంతో వెస్ట్రన్​ డివిజన్​​ అధికారులు తమ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇండ్లలో హౌసింగ్​ బోర్డు శాఖలో పని చేస్తున్న ఓ అధికారి డ్రైవర్​, ఇద్దరు అధికారులు నివాసం ఉంటుండగా కొంత మంది బయటి వ్యక్తులు అధికారులు కిరాయికి ఇచ్చినట్టు సమచారం.

రేపటిలోగా ఖాళీ చేయిస్తాం

630 ఎల్​ఐజీ వెంచర్​-2లో ఖాళీగా ఉన్న ఫ్లాట్స్​లో ఇతరులు నివాసం ఉంటున్న విషయం వాస్తవం, నేను చార్జి తీసుకోక ముందు నుంచి ఉంటున్నారు. వెంటనే అదరిని ఖాళీ చే యించి తాళాలు వేసి, వేలం ద్వారా లబ్ధిదారులకు కే కెటాయిస్తాం. ఖాళీ ప్లాట్స్​లలో ఎవరూ ఉండకుండ చర్య లు తీసుకుంటాం.

-అంకంరావు కరుమురి, ఈఈ, వెస్ట్రన్​ డివిజన్​, హౌసింగ్​ బోర్డు

Next Story