- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు నోటీసులు
బీఆర్ఎస్ నేత, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అసెంబ్లీ స్వీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్(Methuku Anand)కు అసెంబ్లీ స్వీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) శుక్రవారం లీగల్ నోటీసులు(Legal Notices) పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు ఆనంద్ భంగం కలిగించారని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నుంచి స్పీకర్‌కు ముడుపులు ముట్టినాయి కాబట్టే నిర్ణయం తీసుకోవడం లేదని స్థానికంగా ప్రచారం జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఇవాళ లీగల్ నోటీసులు పంపించారు.
మెతుకు ఆనంద్‌కు విమర్శించే అర్హత లేదు :
ఇదిలా ఉంటే.. మెతుకు ఆనంద్‌పై స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను విమర్శించే నైతిక హక్కు మెతుకు ఆనంద్‌కు లేదని కాంగ్రెస్ వికారాబాద్మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి మెతుకు ఆనంద్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు.






