నాసిక్ కేసులో కీలక పరిణామం

by Muthe.Rajitha |

నాసిక్ టీసీఎస్ కేసులో నిందితురాలు నిదాఖాన్ కు ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇల్లు కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేసారు.

నాసిక్ కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని నాసిక్‌లో గల టీసీఎస్ (TCS) కార్యాలయం వేదికగా వెలుగు చూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్ల ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ (Nida Khan), పోలీసుల కళ్లు గప్పి సుమారు 25 రోజుల పాటు పరారీలో ఉండగా.. మే 7న ఔరంగాబాద్ లోని నరేగావ్ ప్రాంతంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిదాఖాన్ పరారీలో ఉన్న సమయంలో ఆమెకు ఆశ్రయం కల్పించిన అంశంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆమె ఏఐఎంఐఎం (AIMIM) పార్టీకి చెందిన కార్పొరేటర్ మతీన్ పటేల్ నివాసంలో తలదాచుకున్నట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆయనను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. నేరస్తులకు ఆశ్రయం ఇవ్వడం మరియు సాక్ష్యాధారాలను మరుగున పరిచే ప్రయత్నం చేయడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఈ వ్యవహారంలో మతీన్ పటేల్ నివాసం అనధికారికంగా నిర్మించబడిందని గుర్తించిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఆ ఇంటికి డెమాలిషన్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఆ భవనం నిర్మించలేదని, అందుకే దానిని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రుజువైతే మతిన్‌ పటేల్‌ తన కార్పొరేటర్‌ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సంస్థలో జరిగిన ఈ మత మార్పిడి, వేధింపుల వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో నాసిక్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Next Story