- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
దవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతోనే సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతోనే సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) స్పష్టం చేశారు. తెలంగాణలోని నిరుపేదలకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సన్నబియ్యం (Fine Rice) పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజా ప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇళ్లలో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ (Minister Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే ఖమ్మం (Kammam) నియోజకవర్గం రఘునాథపాలెం మండల (RaghunadaPalem Mandal) పర్యటన సంధర్భంగా బూడిదంపాడు గ్రామంలో మంత్రి తుమ్మల సన్నబియ్యం లబ్దిదారిని ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తామని, అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. పేదలు దొడ్డు బియ్యం తినలేరని, పీడీఎస్ బియ్యాన్ని (PDS Rice) మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని వివరించారు. పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిందని, ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. రైతుల శ్రమ ఎక్కడికీ పోదని, రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సహిస్తున్నామని తుమ్మల పేర్కొన్నారు.






