భారత ఆర్థికవ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదు: ఆర్‌బీఐ గవర్నర్!

by Disha Web Desk 12 |
భారత ఆర్థికవ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదు: ఆర్‌బీఐ గవర్నర్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదని, ప్రస్తుతం మెరుగైన స్థితిలోనే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. సోమవారం భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పరిమితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే స్థితిలోనే ఉంది. దేశీయంగా ద్రవ్యోల్బణం మితంగా ఉందని ఆశిస్తున్నాం. ద్రవ్యోల్బణం నిర్దేశించిన దానికంటే ఎక్కువ పెరిగే పరిస్థితి నాకు కనిపించడం లేదని ఆయన తెలిపారు. వృద్ధిపై యుద్ధ ప్రభావం అంతంతమాత్రమే ఉంటుంది.

సరుకుల ధరల పై ముడి చమురు ప్రభావం ఉంటుందనుకుంటే, ద్రవ్యోల్బణం ఏడాది మొత్తం స్థిరంగా ఉంటుందని గుర్తించాలన్నారు. గత రెండేళ్లలో ఆర్‌బీఐ రూ. 17 లక్షల కోట్ల లిక్విడిటీని ఇన్‌ఫ్యూజ్ చేసిందని, ఆర్థికవ్యవస్థకు అవసరమైన నిధులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి సంబంధిత లిక్విడిటీ చర్యలన్నీ ముగిసే సమయం ఆసన్నమైందని దాస్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో, రష్యా-ఉక్రెయిన్ దాడి అనంతరం ముడి చమురు, కీలక వస్తువుల ధరల పెరుగుదల వంటి పరిణామాలను ఎదుర్కోవడానికి ఆర్థికవ్యవస్థకు ఆర్‌బీఐ తగిన లిక్విడిటీని కొనసాగిస్తుందని చెప్పారు.


Next Story

Most Viewed