Nitin Gadkari: రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనిపిస్తుంది... నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
Nitin Gadkari Says He Often Feels Like Quitting from Politics
X

దిశ, డైనమిక్ బ్యూరో: Nitin Gadkari Says He Often Feels Like Quitting from Politics| అప్పుడప్పుడు రాజకీయాలు వదిలేయాలనే ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయ‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ఎన్నో సార్లు అనుకున్నాన‌ని, కానీ అది కుదరడం లేద‌న్నారు. రాజ‌కీయాల క‌న్నా జీవితంలో చూడాల్సింది ఎంతో ఉంద‌ని చెప్పారు. జూలై 23న జరిగిన సామాజిక కార్య‌క‌ర్త గిరీశ్ గాంధీ స‌న్మాన కార్య‌క్రమంలో పాల్గొన్న గ‌డ్కరీ ఈ విధంగా చెప్పుకొచ్చారు. రాజ‌కీయాలంటే సామాజిక మార్పు అని, కానీ ఇప్పుడు అంద‌రూ అధికారం కోసం రాజ‌కీయాల‌ను ఆశ్ర‌యిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మహాత్మా గాంధీ కాలం నుండి రాజకీయాలు సామాజిక ఉద్యమంలో ఒక భాగం అయ్యాయని, కానీ తరువాత దాని దృష్టి దేశం, అభివృద్ధి లక్ష్యం వైపు మళ్ళిందని తెలిపారు. ఈ రోజుల్లో రాజ‌కీయాల్లో ప్ర‌తి ఒక్క‌రూ అధికారం కోసం వంద శాతం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, కానీ రాజ‌కీయాలంటే సామాజిక ఆర్థిక సంస్క‌ర‌ణ అని, అందుకే నేటి రాజ‌కీయవేత్త‌లు విద్య, క‌ళ‌లు సంస్క‌ర‌ణ కోసం ప‌నిచేయాల‌ని అన్నారు. రాజ‌కీయం అనే ప‌దాన్ని అర్థం చేసుకోవాల‌ని, అది స‌మాజ, దేశ‌ సంక్షేమం అని తెలిపారు.

ఇది కూడా చదవండి: దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు పదవీ విరమణలా..మెహబూబా ముఫ్తీ

Next Story

Most Viewed