ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూ.NTR.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు (వీడియో)

by Rajesh |
ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూ.NTR.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాసేపు నివాళి అర్పించారు. తెల్లవారు జామునే తారక్, కళ్యాణ్ రామ్ కలిసి వచ్చి తాతయ్య ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ రాగానే ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ భారీ సంఖ్యలో రావడంతో భద్రాతా సిబ్బంది వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అంతకుముందు హీరో బాలకృష్ణ, బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్ పురందరేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు దివంగత మాజీ సీఎంకు నివాళులు అర్పించారు.

Next Story