Mehbooba Mufti: దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు పదవీ విరమణలా..మెహబూబా ముఫ్తీ

by Disha Web Desk 2 |
Ex President of india Ramnath Kovind Fulfilled the BJP Agenda, Says Mehbooba Mufti
X

న్యూఢిల్లీ: Ex President of india Ramnath Kovind Fulfilled the BJP Agenda, Says Mehbooba Mufti| పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నంతకాలం దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. ఇప్పుడు పదవీ విరమణ చేసి వెళ్తున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆమెకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీడీపీ అధినేత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాజీ రాష్ట్రపతిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వానికి కొమ్ములు కాస్తూ.. పార్టీ ఎజెండాను నెరవేర్చాడని ముఫ్తీ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రద్దు చేసి మైనార్టీలకు, దళితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అలాగే జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంపై చర్చించారు. పౌరసత్వ సవరణ చట్టం వివక్ష పూరితమైనదన్నారు. ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.

ఇది కూడా చదవండి: బలహీనతగా భావించవద్దు.. సభ్యులకు లోక్‌సభ స్పీకర్ వార్నింగ్

Next Story

Most Viewed