ఆశీర్వదించండి… మీ రుణం తీర్చుకుంటా : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
ఆశీర్వదించండి… మీ రుణం తీర్చుకుంటా : రంజిత్ రెడ్డి
X

దిశ, తాండూరు : పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి… మీ రుణం తీర్చుకుంటానంటూ చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని సీతారాం పేట్, గుమాస్తా నగర్ , వాసవి కాలనీ తో పాటు పలు ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఇంటింటా ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అమలు చేసిన హామీలు వివరిస్తూ…కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషిగా నేతలందరూ కలిసి కట్టుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ ఆరుగ్యారెంటీ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది అని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి నిరూపించాలి అని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో పేదలకు అందుతాయన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృ ద్ధి సాధ్యమని, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించి, సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

బడుగుల బ్రతుకులను బాగు చేస్తానని గద్దెనెక్కిన బీజేపీ మోడీ ప్రభుత్వం పదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థలను సంపన్నులకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచిపెట్టిందని..ప్రజాస్వామ్యం బతకాలంటే..బడుగు బలహీన వర్గాలు,అగ్రవర్ణాల ప్రజలు ఐక్యతతో మోడీని గద్దె దించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రజలకు కల్పించిన రిజర్వేషన్ హక్కులను తుంగలో తొక్కుతామని బీజేపీ నేతలు బహిరంగంగా వెల్లడిస్తున్నారని..ఇకనైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు మెల్కోని రాజ్యాంగం కల్పించిన అరకోర హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. బీజేపీ మనువాదంతో దేశ ప్రజల్లో వైరాశ్యాలు సృష్టిస్తూ స్వేచ్ఛ, హక్కులు, జీవనం విధానంపై దెబ్బకోడుతోందని ఇప్పటికైనా ప్రజలు అలోచించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి దేశ ఔనత్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరారు.

రంజిత్ రెడ్డిని గెలిపించుకుందాం:ఎమ్మెల్యే

దేశంలో పేద ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కాంగ్రెస్‌ ద్వారా మాత్రమే సాధ్యమని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రతి కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని, కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed