పవర్ బిల్‌ తగ్గించే 'ఎలక్ట్రిక్ స్విచ్'.. నిట్ పరిశోధకుల ఘనత!

by Web Desk |

పవర్ బిల్‌ తగ్గించే ఎలక్ట్రిక్ స్విచ్.. నిట్ పరిశోధకుల ఘనత!
X

దిశ, ఫీచర్స్: ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) పరిశోధకులు ఐవోటీ(IoT) ఆధారిత ఎలక్ట్రికల్ స్విచ్‌ను అభివృద్ధి చేశారు. ఇది పర్టిక్యులర్ ఎలక్ట్రికల్ అప్లయెన్స్(నిర్దిష్ట విద్యుత్ ఉపకరణం).. ఎంత మేర విద్యుత్ వినియోగిస్తుందో తెలియజేస్తుంది. తద్వారా విద్యుత్ బిల్ ఆదా చేయడంలో ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐవోటీ ఆధారిత స్విచ్‌లు.. వైర్‌లెస్ మాధ్యమం ద్వారా లోడ్స్‌ను ఆపరేట్ చేసేందుకే పరిమితమయ్యాయి. ఇవి ప్రతీ పరికరానికి సంబంధించిన వినియోగ డేటాను రికార్డ్, స్టోర్ చేయవు. NIT ఇంజినీర్లు డెవలప్ చేసిన స్విచ్ మాత్రం ఈ పనులన్నీ చేస్తుంది. తక్కువ శక్తిని వినియోగించుకోవడమే కాక ఫ్లెక్సిబుల్‌గా ఉన్నందున ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ నిర్మించడంలోనూ ఉపయోగించుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్విచ్ విషయానికొస్తే.. 'మాస్టర్, స్లేవ్' వంటి రెండు మాడ్యూల్స్‌లో విడుదల చేశారు. మాస్టర్ స్విచ్.. మొబైల్ పరికరంలోని వైఫై ఆధారంగా పనిచేస్తుంది. ప్రతి ఎలక్ట్రికల్ ఉపకరణానికి నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రతీ పరికరానికి సంబంధించిన వోల్టేజ్, పవర్ ఫ్యాక్టర్, పవర్ యూసేజ్‌ను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారం పవర్ లైన్ కమ్యూనికేషన్ లేదా PLC ద్వారా మాస్టర్ పరికరంతో షేర్ చేయబడుతుంది. అదే సమయంలో వినియోగదారుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రిమోట్‌గా పర్యవేక్షించడంతో పాటు నియంత్రించే అవకాశం కూడా ఉంది. కాగా ఈ పరికరాన్ని కమర్షియలైజ్ చేసేందుకు స్టార్టప్‌ను ప్రారంభించాలని పరిశోధకులు యోచిస్తున్నారు.

Next Story